Karnataka Cabinet : 24 మందితో కర్ణాటక కేబినెట్ విస్తరణ
ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేలు
Karnataka Cabinet : కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్(Karnataka Cabinet) ను విస్తరించే పనిలో పడింది. ఇప్పటికే సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. పార్టీ హైకమాండ్ తో చర్చించారు. ఈ మేరకు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కొత్తగా 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసే వారిలో హెచ్ కే పాటిల్ , కృష్ణ బైరే గౌడ, ఎన్ చెలువ రాయ స్వామి, కే. వెంకటేశ్ , హెచ్ సీ మహదేవప్ప, ఈశ్వర్ ఖండ్రే, దినేష్ గుండూరావు ఉన్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. దాదాపు మంత్రివర్గంలో 34 మంది ఉండవచ్చని అంచనా. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం చేశారు. యూటీ ఖదీర్ స్పీకర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఇంకా మంత్రుల జాబితాలో క్యాత సాంద్ర ఎన్ రాజన్న, శరణ బసప్ప, దర్శన్ పూర్ , శివానంద పాటిల్ , రామప్ప బాలప్ప తిమ్మాపూర్ , ఎస్ స్ మల్లికార్జున్ , శివరాజ్ సంగప్ప, తండగడి, శరణ్ ప్రకాష్ రుద్రప్ప పాటిల్ , మంకాల్ వైద్య, లక్ష్మీ హెబ్బాల్కర్ , రహీం ఖాన్ , డి. సుధాకర్, సంతోష్ బోస్ లడ్డు, సురేష్ బి లడ్బు ఉన్నారు. వీరితో పాటు మధు బంగారప్ప, ఎంసీ సుధాకర్, బి. నాగేంద్రకు కూడా కేబినెట్ లో చోటు దక్కనుంది. కాంగ్రెస్ జాబితాలో ఆరుగురు లింగాయత్ లు, నలుగురు వొక్కలిగ పేర్లు ఉన్నాయి. ముగ్గురు ఎస్సీ నుంచి , ఇద్దరు ఎస్టీ నుంచి, ఐదుగురు ఓబీసీకి చెందిన వారు.
Also Read : Sajjala Ramakrishna Reddy
