Mohammad Iqbal : సారే జహాన్ సే అచ్చా కవికి అవమానం
సిలబస్ నుంచి తొలగించాలని తీర్మానం
Mohammad Iqbal : కేంద్ర ప్రభుత్వం తన జాతీయవాద ఎజెండాను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిన్నటి దాకా అంబేద్కర్ కోర్సును తొలగించాలని సిఫారసు చేసింది ఢిల్లీ యూనివర్శిటీ ప్యానల్ కమిటీ. ఇది తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ తరుణలో మరో వివాదం తెర పైకి వచ్చింది. భారత దేశంలో అత్యంత పేరు పొందిన జాతీయ గీతం సారే జహాన్ సే అచ్చా గీతం. దీనిని ఉమ్మడి భారత దేశంలోని సియోల్ కోట్ లో జన్మించిన ముహమ్మద్ అల్లమా ఇక్బాల్(Mohammad Iqbal) రాశారు. 1877లో పుట్టిన ఆయన రాసిన ఈ గీతం రవీంద్ర నాథ్ ఠాగూర్ రాసిన జన గణ మన అధినాయక జయహే గీతంతో పాటు ఆదరణ పొందింది.
భారత్ విభజన తర్వాత పాకిస్తాన్ కు వెళ్ళారు. అక్కడ జాతీయ కవిగా గుర్తింపు పొందారు ఇక్బాల్. ఆయనపై ఉన్న అధ్యాయాన్ని పొలిటికల్ సైన్స్ సిలబస్ నుండి తొలగించాలని ఢిల్లీ విశ్వ విద్యాలయంలోని అకడమిక్ కౌన్సిల్ ఒక తీర్మానం ఆమోదించింది. ఈ విషయాన్ని బాడీ సభ్యులు ధ్రువీకరించారు.
మోడరన్ ఇండియన్ పొలిటికల్ థాట్ అనే అధ్యాయం బీఏ ఆరో సెమిస్టర్ పేపర్ లో భాగంగా ఉంది. ఈ విషయాన్ని ఇప్పుడు విశ్వ విద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందు సమర్పించనున్నట్లు తెలిపారు. బీజేపీతో పాటు దాని అనుబంధ సంస్థలు ఆర్ఎస్ఎస్, ఏబీబీపీ ఈ పరిణామాన్ని స్వాగతించింది. తీర్మానం మా దృష్టికి వచ్చింది. సిలబస్ నుండి ఇక్బాల్ పై ఉన్న అధ్యాయాన్ని తొలగించినట్లు అకడమిక్ కౌన్సిల్ సభ్యుడు చెప్పారు.
Also Read : CBI YS Jagan
