TDP Mahanadu 2023 : తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి పూర్తిగా పసుపుమయంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ మహానాడు(TDP Mahanadu 2023) చేపట్టింది. ఇది రెండు రోజుల పాటు కొనసాగనుంది. శనివారం ప్రతినిధుల సభను ఏర్పాటు చేశారు. కనీసం 15,000 మంది వస్తారని అంచనా వేసింది టీడీపీ. మే 28న భారీ బహిరంగ సభ చేపట్టనుంది.
దాదాపు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు కూడా హాజరు కానున్నారు. 15 లక్షల మందికి పైగా హాజరు కానున్నట్లు సమాచారం. ప్రతి ఒక్కరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసింది టీడీపీ.
ఇక అంగరంగ వైభవంగా మహానాడు ప్రారంభమైంది. మోరంపూడి జంక్షన్ వద్ద నుంచి సభా ప్రాంగణం దాకా పూర్తిగా రహదారులన్నీ పసుపుమయం అయ్యాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత టీడీపీదేనని పేర్కొన్నారు. పలువురు వక్తలు ప్రసంగించారు.
తెలంగాణ టీడీపీ జ్ఞానేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా దగ్గర ఓ పిచ్చోడు ఉన్నాడని మీ దగ్గర ఓ సైకో ఉన్నాడంటూ ఆరోపించారు. ఎన్టీఆర్ ది ఆత్మ గౌరవ నినాదమైంతే చంద్రబాబుది ఆత్మ విశ్వాస నినాదమన్నారు.
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీని ఎదుర్కోలేక కోడి కత్తి డ్రామా ఆడారని, సొంత బాబాయిని చంపి సింపతితో గెలుపొందారంటూ ఆరోపించారు. 15 వేలకే పరిమితం చేసినా భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. వాహనాలతో ట్రాఫిక్ జాం ఏర్పడింది.
Also Read : NTR Comment
