Indian Army Chief : మణిపూర్ హింసపై ఆర్మీ చీఫ్ ఆరా
రెండు రోజుల పర్యటనలో మనోజ్ పాండే
Indian Army Chief : మణిపూర్ లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే(Army Chief ) ఆరా తీశారు. ఇటీవల పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా రెండు రోజుల పర్యటనలో భాగంగా మణిపూర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ రాజ్ భవన్ లో మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉకేతో రాష్‌ట్రా రాజధాని ఇంఫాల్ లో సమావేశం అయ్యారు.
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా చెదురు మదురు హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇక్కడికి వచ్చారు. ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్బంగా గవర్నర్ పూర్తి వివరాలను అందజేశారు.
జనరల్ మనోజ్ పాండేతో పాటు ఈస్టర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ రాణా ప్రతాప్ కలిత కూడా ఉన్నారు. ఇంఫాల్ నగరంలోని మంత్రిపుక్రీలో ఉన్న అస్సాం రైఫిల్స్ ఐజీ ప్రధాన కార్యాలయానికి భారీ భద్రత కల్పించారు.
ఇవాళ మరోసారి జనరల్ పాండే గవర్నర్ , సీఎం, భద్రతా సలహాదారులతో సమావేశం అవుతారని వెల్లడించారు. ఇతర దళాలతో సహా గ్రౌండ్ కమాండర్లను కూడా కలుసుకుంటారు. అనంతరం రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న ఘర్షణలు జరిగిన ప్రాంతాలను కూడా సందర్శిస్తారు ఆర్మీ జనరల్. ఇదిలా ఉండగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. కాగా త్వరలోనే ఆర్మీ చీఫ్ పర్యటించనున్నట్లు సమాచారం.
Also Read : YS Jagan
