Manmohan Singh : మోదీ వ‌ల్ల దేశానికి ప్ర‌మాదం

మాజీ పీఎం మ‌న్మోహ‌న్ సింగ్

Manmohan Singh : మాజీ ప్ర‌ధాన మంత్రి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్(Manmohan Singh) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నిర్వాకం కార‌ణంగా భార‌త దేశం అన్ని రంగాల‌లో ప్ర‌మాదం అంచున నిలిచి ఉంద‌ని హెచ్చ‌రించారు. అసంబ‌ద్ద నిర్ణ‌యాల వ‌ల్ల ఆర్థిక ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారనుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మోదీ ప్ర‌మాణ స్వీకారం చేసిన 9 ఏళ్ల త‌ర్వాత దేశం ఉన్న చోట‌నే ఉండి పోయింద‌ని పేర్కొన్నారు.

దేశంలో అపార‌మైన వ‌న‌రులు ఉన్నాయ‌ని వాటిని గంప గుత్త‌గా ధారాద‌త్తం చేసిన ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంద‌న్నారు. ఇవాళ నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని నిర్మించార‌ని రేపొద్దున పాత పార్ల‌మెంట్ ను కూడా అమ్మ‌కానికి పెడ‌తారేమోన‌ని అనుమానం వ్య‌క్తం చేశారు డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్. పీఎం అనాలోచిత ఆలోచ‌న‌ల వ‌ల్ల నిరుద్యోగం పెరిగింద‌న్నారు. ప్ర‌తిభావంతులైన యువ‌తీ యువ‌కుల క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యాయ‌ని పేర్కొన్నారు. ధ‌ర‌ల పెరుగుద‌ల గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా పెర‌గ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది పూర్తిగా దేశానికి అడ్డంకిగా త‌యార‌వుతుంద‌ని హెచ్చ‌రించారు మ‌న్మోహ‌న్ సింగ్.

ముంద‌స్తు ఆలోచ‌న లేక పోవ‌డం వ‌ల్ల క‌రోనాను కంట్రోల్ చేయ‌లేక పోవ‌డం వ‌ల్ల ల‌క్ష‌లాది మంది ప్రాణాలు కోల్పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు వ్యాపార‌వేత్త‌ల కోసం ప్ర‌యారిటీ ఇచ్చిన మోదీ రైతుల‌ను ఇబ్బందుల‌కు గురి చేశార‌ని ఆరోపించారు. చివ‌ర‌కు తాను తీసుకు వ‌చ్చిన నల్ల చ‌ట్టాల‌ను తానే వెన‌క్కి తీసుకున్నార‌ని పేర్కొన్నారు. చైనా ఇప్ప‌టికే 1,000 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లను మింగేసింద‌ని ఆవేద‌న చెందారు.

Also Read : Shubman Gill

Leave A Reply

Your Email Id will not be published!