Balakrishna Chandrababu : బావా బావమరుదుల హల్ చల్
మహానాడులో బాలయ్య అదుర్స్
Balakrishna Chandrababu : తెలుగుదేశం పార్టీ రాజమండ్రి వేదికగా నిర్వహించిన మహానాడు ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. లక్షలాదిగా తరలి వచ్చారు జనం. 15 లక్షలకు పైగా హాజరైనట్లు అంచనా. ఎటు చూసినా జనంతో నిండి పోవడంతో చాలా మంది బయటే ఉండి పోయారు. సభా ప్రాంగణం ఇసుక వేస్తే రాలనంతగా నిండి పోయింది.
దీంతో టీడీపీ శ్రేణులు ఆనంద డోలికల్లో మునిగి పోయారు. ఇదిలా ఉండగా సభా ప్రాంగణంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. తన మాటల తూటాలతో ఆకట్టుకుంటున్న నందమూరి బాలకృష్ణ(Balakrishna) స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. విచిత్రం ఏమిటంటే బావా బావమరుదులు ఇద్దరూ మహానాడు వేదికపైకి వచ్చారు. అశేష జన వాహినికి అభివాదం చేశారు.
మహానాడుకు హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు చెప్పారు బాలయ్య బాబు. ఆయన స్టేజీపై ఆశీనులు కాగానే మీసం తెప్పారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే బాలయ్య అటు వెండి తెర పైనే కాకుండా బుల్లి తెరపై కూడా దుమ్ము రేపుతున్నాడు. హల్ చేస్తున్నాడు.
ఆయన నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ రియాల్టీ షో ఇండియాలోనే టాప్ గా నిలిచింది. అంతే కాదు ప్రపంచాన్ని శాసిస్తున్న ఐపీఎల్ ను ప్రసారం చేస్తున్నస్టార్ స్పోర్స్ కు కూడా తన గాత్రాన్ని అరువుగా ఇచ్చారు. ఏది ఏమైనా తన తండ్రి దివంగత సీఎం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి జనం ఆదరణ తగ్గక పోవడాన్ని చూసి సంతోషించారు బాలయ్య.
Also Read : NTR TDP