TTD EO AV Dharma Reddy : ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే అభివృద్ది
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో
TTD EO AV Dharma Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి(TTD EO AV Dharma Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ సంస్థ అభివృద్ది సాధించాలన్నా నాణ్యతతో రాజీ పడకుండా లక్ష్యాలను సాధించేందుకు ఆర్థిక క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. గత మూడు సంవత్సరాల కాలంలో టీడీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ ఘనత సాధించిందని చెప్పారు ఏవీ ధర్మారెడ్డి.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుత సిఈవో సమర్థవంతంగా సమన్వయం చేసుకొని ఎస్వీబీసీ పరిపాలన, ఆర్థిక అంశాల్లోని లోపాలను అధిగమించారని అన్నారు. భగవత్గీత లోని కొన్ని శ్లోకాలను అర్థాన్ని ఉదహరించారు. ప్రతి ఉద్యోగి సంస్థను స్వంతంగా భావించి , దాని ప్రతిష్ట కోసం కృషి చేయాలని కోరారు ఈవో ఏవీ ధర్మారెడ్డి.
సుందరకాండ, భగవద్గీత, యోగ దర్శనం మొదలైన కార్యక్రమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎస్వీబీసీకి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ, పేరు ప్రఖ్యాతులు లభించాయని చెప్పారు. మూడేళ్లలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆధ్యాత్మిక ఛానెల్ లో అగ్ర స్థానం ఉందన్నారు. దాదాపు 50 శాతం అనవసరమైన ఖర్చులను తగ్గించడం ద్వారా ఈ ఘనత సాధించామని స్పష్టం చేశారు. కార్యక్రమాల నాణ్యతలో ఎక్కడా రాజీ పడలేదన్నారు ఏవీ ధర్మారెడ్డి.
సిఈవోను ప్రతి నెలా సమావేశం నిర్వహించి భక్తుల కోసం ఏ విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందించాలి, నాణ్యతను మరింతగా ఎలా పెంచాలనే దానిపై సిబ్బంది అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కూడా తీసుకోవాలని ఈవో సూచించారు.
Also Read : Balakrishna Chandrababu