Rajasthan Congress Row : ఖ‌ర్గేతో భేటీకి గెహ్లాట్..పైల‌ట్ రెఢీ

రాజ‌స్థాన్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు

Rajasthan Congress Row : రాజ‌స్థాన్ లో రాజ‌కీయం మ‌రింత వేడిని రాజేస్తోంది. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ , మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో రాజ‌కీయం మ‌రింత ఊపందుకుంది. ఒక‌రిపై మ‌రొక‌రు కారాలు మిరియాలు నూరుతున్నారు. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసుకుంటూ పార్టీని మ‌రింత గంద‌ర‌గోళంలోకి నెట్టి వేస్తున్నారు.

భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ప్ర‌య‌త్నాలు ఏవీ ఫలించ‌లేదు. చివ‌ర‌కు స‌చిన్ పైల‌ట్ ఏకంగా త‌మ పార్టీకి చెందిన సీఎంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సీఎం అశోక్ గెహ్లాట్ కావాల‌ని బీజేపీకి(BJP) స‌పోర్ట్ చేస్తున్నారంటూ బాంబు పేల్చాడు. ఆపై మాజీ సీఎం వ‌సంధుర రాజేను సీఎం వెన‌కేసుకు వ‌స్తున్నాడ‌ని ఇదెక్క‌డి అన్యాయం అంటూ ప్ర‌శ్నించారు స‌చిన్ పైల‌ట్.

అంతే కాకుండా గ‌తంలో బీజేపీ హ‌యాంలో చోటు చేసుకున్న అక్ర‌మాలు, స్కాంల‌పై కాంగ్రెస్(Congress) ప్ర‌భుత్వం ఎందుకు విచార‌ణ కు ఆదేశించడం లేద‌ని దీని వెనుక ఎవ‌రు ఉన్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇదే స‌మ‌యంలో స‌చిన్ పైల‌ట్ ఒక రోజు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా దీక్ష‌కు దిగారు. దీనిని సీరియ‌స్ గా తీసుకుంది కాంగ్రెస్ హై క‌మాండ్. నోటీసులు జారీ చేసింది. చివ‌ర‌కు ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు ఏఐసీసీ ఢిల్లీకి రావాలంటూ పిలుపునిచ్చింది. ఇవాళ్ల సీఎం గెహ్లాట్ , మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ ఖ‌ర్గేతో భేటీ కానున్నారు.

Also Read : DCW Chief

 

Leave A Reply

Your Email Id will not be published!