YS Jagan : అనాధ పిల్లలకు జగన్ భరోసా
నిర్మల్ హృదయ్ భవన్ సందర్శన
YS Jagan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించారు. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్ లో అనాధ పిల్లలతో ముచ్చటించారు. వారికి భరోసా కల్పించారు. జగన్ వెంట ఆయన భార్య భారతీ రెడ్డి కూడా ఉన్నారు. ఉదయం 10.10 గంటల నుండి 10.40 వరకు అనాధ పిల్లలతో గడిపారు. అనంతరం నేరుగా తాడేపల్లి గూడెంలోని తన నివాసానికి చేరుకున్నారు. సతీ సమేతంగా వెళ్లిన జగన్ రెడ్డి నిర్మల్ హృదయ్ లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలను ప్రారంభించారు.
ఆశ్రమంలోని వృద్దులు, దివ్యాంగులతో మాట్లాడారు. నిర్వాహకులతో ప్రత్యేకంగా సంభాషించారు. తన(YS Jagan) పరంగా ఏమైనా సాయం కావాలన్నా అందజేస్తానని హామీ ఇచ్చారు. చిన్నారులను ముద్దాడారు. ఆయన సతీమణి భారతీ రెడ్డి చిన్నారుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనాధ వృద్దులను చేయి పట్టుకుని నడిపించారు సీఎం వైఎస్ జగన్ రెడ్డి. ఇదిలా ఉండగా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలో నిర్మల్ హృదయ్ భవన్ ను నిర్వహిస్తున్నారు.
గత కొంత కాలంగా కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ప్రస్తుతం సీఎం , సతీమణి భారతి రావడంతో ఒక్కసారిగా నిర్మల్ హృదయ్ భవన్ గురించి అందరూ ఆరా తీస్తున్నారు. సేవా భావంతో వృద్దులకు, అనాధ చిన్నారులకు సేవ చేయడం అత్యంత గొప్ప విషయమన్నారు జగన్ రెడ్డి. నిర్వాహకులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు.
Also Read : SSMB28 First Look