SPG Director Sinha : ఎస్పీజీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు
కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
SPG Director Sinha : కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించి చేతులు కాల్చుకుంది. కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టింది సుప్రంకోర్టు. తాజాగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డైరెక్టర్(SPG Director) పదవీ విరమణకు ఒక్క రోజు ముందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు ఆయనను తిరిగి నియమించింది. ఇందుకు సంబంధించి డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా అరుణ్ కుమార్ సిన్హా(Arun Kumar Sinha) 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇది నిబంధనల ప్రకారం జరిగింది. ఒక ఐపీఎస్ కు కేవలం ఆరు నెలల పాటు మాత్రమే పొడగింపు ఇవ్వబడుతుంది. ఒకరికి అంతకు మించి గడువు కాలం పొడిగిస్తే ఎస్పీజీ రూల్స్ సవరించాల్సి ఉంటుంది. దీంతో తిరిగి సిన్హాను నియమించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
సిన్హా పదవీ విరమణ చేయాల్సింది మే 31. ఇవ్వాల్టితో గడువు తీరి పోతుంది. ఆయన ఒక ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏది ముందైతే అది కాంట్రాక్ట్ ప్రాతిపదికన తిరిగి నియమించు కునేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదించినట్లు హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Also Read : Punjab CM Mann