Rahul Gandhi : దేవుడిగా భావిస్తున్న మోదీ – రాహుల్
ప్రధానమంత్రిపై సంచలన కామెంట్స్
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర సర్కార్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆరు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ(Rahul Gandhi) అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా శాన్ ఫ్రాన్సిస్ స్కోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ తనను తాను గొప్ప నాయకుడిగా, అంతకంటే దేవుడిగా భావిస్తున్నారంటూ ఆరోపించారు. తనను మించిన మేధావి లేడని కూడా భావిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
కొంత మంది తమకు తెలుసునని గొప్పలు పోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను తాను తెలుసుకున్నానని కానీ మోదీ కేవలం ఉన్నత వర్గాలకు, వ్యాపారవేత్తలకు లబ్ది చేకూరేలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను నమ్మించి మోసం చేయడంలో, కులం, ప్రాంతం, మతం పేరుతో రాజకీయాలు చేయడంలో మోదీ ఆరి తేరారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
కొన్ని నెలల కిందట తాను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టాను. ఎందరో తనను కలుసుకున్నారని వారి బాధల గురించి తనతో పంచుకున్నారని తెలిపారు రాహుల్ గాంధీ. మొహబ్బత్ కి దుకాన్ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చెప్పారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. కొన్ని సమూహాలు పనిగట్టుకుని తామే దేవుళ్లకు, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ.
Also Read : Jio Cinema Record IPL