Chinna Sesha Vahanam : ప్రసన్న వేంకటేశ్వరుడి వైభవం
వేణుగోపాల స్వామి అలంకారంలో దర్శనం
Chinna Sesha Vahanam : తిరుపతి సమీపంలోని అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భారీ ఎత్తున చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణు గోపాల స్వామి అలంకారంలో చిన్న శేష వాహనం(Chinna Sesha Vahanam)పై అభయం ఇచ్చారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామి విహరించారు. భక్తులను కటాక్షించారు.
ఇక చిన్న శేష వాహనం శ్రీవారి వ్యక్త రూపమైన పాంచ భౌతిక ప్రకృతికి సంకేతంగా భావిస్తారు. ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. పంచ శిరస్సుల చిన్న శేషుని దర్శనం మహా శ్రేయస్కరమని నమ్ముతారు.
సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఊంజల సేవ చేపట్టారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు హంస వాహన సేవపై ఊరేగారు. భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాలలో భాగంగా తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.
Also Read : K Annamalai Jadeja