Suryaprabha Vahanam : గోవిందుడి దర్శనం అపురూపం
సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు
Suryaprabha Vahanam : తిరుపతి లోని శ్రీ గొవింద రాజ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. మాడ వీధుల్లో స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఇక శ్రీ గోవింద రాజ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడో రోజు గురువారం ఉదయం స్వామి వారు సూర్య ప్రభ వాహనంపై(Suryaprabha Vahanam) దర్శనం ఇచ్చారు.
సూర్యుడి తేజో నిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు అతడి వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్య తేజం వల్లనే వెలుగొందుతున్నాయని భక్తులు భావిస్తారు. ఇక వాహన సేవ అనంతరం ఉదయం 9.30 గంటల నుండి 10.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు , పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో శ్రీదేవి , భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేకం చేశారు.
సాయంత్రం 5.30 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల సేవ కొనసాగింది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ ఘనంగా నిర్వహించారు. వాహన సేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి , కకణ భట్టార్ శ్రీనివాస దీక్షితులు, ఆలయ డీఇఓ శాంతి పాల్గొన్నారు.
Also Read : Chinna Sesha Vahanam