KTR : కేసీఆర్ పాల‌న‌లో రాష్ట్రం సుభిక్షం

అభివృద్దిలో ప‌రుగులు పెడుతోన్న తెలంగాణ

KTR : గేలి చేసిన వాళ్లు, విమ‌ర్శించిన వాళ్లు త‌ల దించుకునేలా ఇవాళ తెలంగాణ స‌గ‌ర్వంగా నిల‌బ‌డింది. భాష‌ను వెక్క‌రించారు, పాల‌న చేత కాద‌న్నారు. కానీ దేశానికే ఆద‌ర్శ ప్రాయంగా మ‌న రాష్ట్రం మారింద‌న్నారు మంత్రి కేటీఆర్(KTR). సీఎం కేసీఆర్ పాల‌న‌లో తెలంగాణ అన్ని రంగాల‌లో ముందంజ‌లో ఉంద‌న్నారు. పాల‌నా ప‌రంగా కీల‌క మార్పులు , సంస్క‌ర‌ణ‌లు తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త కేసీఆర్ దేన‌ని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్బంగా రాజ‌న్న సిరిసిల్లా జిల్లా క‌లెక్ట‌రేట్ లో జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు.

విద్య‌, వైద్యం, ఉపాధి క‌ల్పించ‌డంలో టాప్ లో ఉన్నామ‌ని చెప్పారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా పారిశ్రామిక పాల‌సీని తీసుకు వ‌చ్చామ‌న్నారు. వంద‌లాది కంపెనీలు హైద‌రాబాద్ లో కొలువు తీరాయ‌ని తెలిపారు. వేలాది మందికి ఉపాధి ల‌భిస్తోంద‌న్నారు. ఒక‌నాడు నీళ్లు లేక‌, నిధులు రాక , కొలువులు ఇవ్వ‌క ఇబ్బందులు ప‌డిన తెలంగాణ ఇప్పుడు అభివృద్దిలో దూసుకు పోతోంద‌న్నారు. ఎక్క‌డ చూసినా నీళ్లు క‌నిపిస్తున్నాయ‌ని, ఒకప్పుడు అంత‌టా క‌రువే ఉండేద‌న్నారు. ఆనాడు విద్యుత్ కు క‌ట‌క‌ట ఉండేద‌ని కానీ ఇవాళ 24 గంట‌ల పాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా సాగుతోంద‌న్నారు కేటీఆర్(KTR).

గ‌తంలో వ్య‌వ‌సాయ రంగానికి అర‌కొర నిధులు ఇచ్చే వార‌ని కానీ ఇవాళ్ల రైతు బంధుతో అన్న‌దాత‌ల క‌ళ్ల‌ల్లో ఆనందం వెల్లి విరిసేలా చేశార‌ని చెప్పారు. భారీ ప్రాజెక్టుల‌ను చేప‌ట్టామ‌ని, క‌ల్తీ ఎరువులు, విత్త‌నాలు లేకుండా చేశామ‌న్నారు. విత్త‌నాలు నాట‌డం ద‌గ్గ‌రి నుంచి పంట పండేంత దాకా స‌ర్కారే బాధ్య‌త వ‌హిస్తోంద‌న్నారు కేటీఆర్.

Also Read : CM KCR

 

Leave A Reply

Your Email Id will not be published!