CJI DY Chandrachud : హైకోర్టు ఆర్డర్ పై సీజేఐ జోక్యం
సంచలనంగా మారిన నిర్ణయం
CJI DY Chandrachud : సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్(CJI DY Chandrachud) సంచలనంగా మారారు మరోసారి. ఆయన ఇచ్చే తీర్పులు ఒక్కోసారి ఆలోచింప చేసేలా ఉంటాయ. తాజాగా సెలవుల్లో ఉన్నప్పటికీ సీజేఐ ఓ కేసు విషయంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేప్ సర్వైవర్ కోసం హైకోర్టు ఇచ్చిన మాంగ్లిక్ ఆర్డర్ పై ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు. ఈ కేసును విచారించేందుకు బెంచ్ ను ఏర్పాటు చేయాలని సీజేఐ సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.
అత్యాచార బాధితురాలి జాతకాన్ని పరిశీలించాల్సిందిగా అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఆమె మాంగ్లిక్ గా ఉందో లేదో తెలుసుకునేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి విదేశాల్లో ఉన్నప్పటికీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సీజేఐ తీసుకున్న చర్య అసాధారణమైనది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఇచ్చారు. శని, ఆదివారాలలో ఎటువంటి విచారణలు జరగలేదు.
ఇవాళ ఉదయం అలహాబాద్ హైకోర్టు ఆదేశాల గురించి సీజేఐ తెలుసుకున్నారని , ఈ విషయాన్ని గమనించేందుకు బెంచ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు వర్గాల్లో కలకలం రేపింది. న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, పంకజ్ మిథాల్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించారు.
Also Read : Sam Pitroda Modi