Udhay Nidhi Stalin : బాధితుల గురించి ఉదయనిధి ఆరా
బాలాసోర్ సంఘటన స్థలం సందర్శన
Udhay Nidhi Stalin : తమిళనాడు యువజన సర్వీసుల శాఖ మంత్రి , సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్(Udhay Nidhi Stalin) తో పాటు మరో మంత్రి ఒడిశా రాష్ట్రంలోని బాలా సోర్ జిల్లాలో చోటు చేసుకున్న రైలు ఘటన స్థలానికి చేరుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు వారు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. తమిళనాడుకు చెందిన వారు ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎక్కడ చూసినా గుట్టలుగా పడి ఉన్నాయి మృత దేహాలు. కొన్నింటిని ట్రాక్టర్లలోకి వేస్తున్నారు. మరికొందరి మృత దేహాలు గుర్తు పట్టనంతగా మారి పోయాయి.
ఈ తరుణంలో సీఎం ఓ వైపు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు, బాధితులకు పరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశించిన వెంటనే ఉదయనిధి స్టాలిన్ తోటి మంత్రితో కలిసి బాలా సోర్ కు చేరుకున్నారు. ఆయనే స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. తమ రాష్ట్రానికి చెందిన వారు ఎవరైనా ఉన్నారేమోనని వివరాలు సేకరించారు ఉదయనిధి స్టాలిన్.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఎవరూ చని పోలేదని, ఇంకా గాయపడిన వారు ఎవరైనా ఉన్నారేమోనని ఆరా తీస్తున్నారు. అయితే మొత్తం రిస్క్ ఆపరేషన్స్ పూర్తయ్యేంత వరకు తమ మంత్రులు అక్కడే ఉంటారని స్పష్టం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇదిలా ఉండగా ఈ ఘటనలో ఇప్పటి వరకు 288 వరకు చని పోగా 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
Also Read : CM MK Stalin