Ashwini Vaishnaw : అన్నీ తానైన అశ్వినీ వైష్ణవ్
బాలా సూర్ లోనే మంత్రి మకాం
Ashwini Vaishnaw : ఒడిశా రైలు దుర్ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురవుతున్నారు కేంద్ర రైల్వే, టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw). ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ , బీఆర్ఎస్ అగ్ర నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు రైల్వే శాఖా మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే తన పదవికి రాజీనామా చేశారని, అప్పటి ప్రధాని నెహ్రూ వద్దనా వినిపించు కోలేదని గుర్తు చేశారు. మరో వైపు గతంలో ఎన్డీఏలో, యూపీఏ సర్కార్ హయాంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేసిన ప్రస్తుత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం అశ్వినీ వైష్ణవ్ పై నిప్పులు చెరిగారు.
ఆయనను మీడియా ముందే నిలదీశారు..కడిగి పారేశారు. రైల్వే శాఖ తన స్వంత బిడ్డ లాంటిదని పేర్కొన్నారు. యాంటీ డివైజ్ ఏర్పాటు చేసి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. ఎందుకని కేంద్రం దీనిని ఏర్పాటు చేయలేక పోయిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు దీదీ.
ఇదిలా ఉండగా ఘటన జరిగిన వెంటనే స్థలం వద్దకు చేరుకున్నారు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. అన్నీ తానై వ్యవహరించారు. అటు కేంద్రం ఇటు రాష్ట్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు కదిలారు. సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఓ సామాన్యుడిలానే ఆయన వ్యవహరించారు. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : Bhatti Vikramarka