S Jai Shankar : ప్ర‌పంచం అంతిమ ల‌క్ష్యం శాంతి కావాలి

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంక‌ర్

S Jai Shankar : యావ‌త్ ప్ర‌పంచం నిత్యం ఉగ్ర‌వాదం నుంచి స‌వాళ్ల‌ను ఎదుర్కొంటోంది. దీనిని త్య‌జించేందుకు, లేకుండా చేసేందుకు అన్ని దేశాలు క‌లిసిక‌ట్టుగా ఉమ్మ‌డిగా పోరాటం చేసేందుకు స‌న్నద్దం కావాల‌ని పిలుపునిచ్చారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar) . భార‌త దేశం , ద‌క్షిణాఫ్రికా దేశాల మ‌ధ్య గ‌త 30 ఏళ్లుగా స‌త్ సంబంధాల‌ను కొన‌సాగిస్తూ వ‌స్తున్నాయ‌ని గుర్తు చేశారు. ఇదే స‌మ‌యంలో గ‌త ఏడాది భార‌త‌దేశం 86 బిలియ‌న్ డాల‌ర్ల ఎఫ్డీఐ ప్ర‌పంచం లోనే అతి పెద్ద‌ద‌ని పేర్కొన్నారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వ పాల‌నపై ప్ర‌పంచం దృష్టి సారిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు జై శంక‌ర్. భార‌త దేశం ఇక‌పై సాపేక్షంగా నెమ్మ‌దిగా క‌ద‌ల‌డం లేద‌న్నారు. జై శంక‌ర్ త‌న మూడు రోజుల ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని ఐదు దేశాల బ్రిక్స్ గ్రూపింగ్ స‌మావేశం లో పాల్గొనేందుకు వ‌చ్చారు.

త‌న గౌర‌వార్థం కేప్ టౌన్ లో స్థానిక డ‌యాస్పోరా , ప్ర‌వాస సంఘం ఏర్పాటు చేసిన స‌మావేశంలో సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ మాట్లాడారు. ఇరు దేశాల మ‌ధ్య విడ‌దీయ‌రాని సంబంధాలు క‌లిగి ఉన్నాయ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా మ‌హోన్న‌త నాయ‌కుడు నెల్స‌న్ మండేలా చేసిన కృషిని సంద‌ర్భంగా గుర్తు చేశారు కేంద్ర మంత్రి. ఇదిలా ఉండ‌గా బ్రిక్స్ కూట‌మి స‌మావేశానికి బ్రెజిల్, ర‌ష్యా, చైనా దేశాల నుంచి వ‌చ్చిన స‌హ‌చ‌ర మంత్రుల‌తో సంభాషించారు.

Also Read : Ashwini Vaishnaw

Leave A Reply

Your Email Id will not be published!