Sameer Wankhede : దావుద్ పేరుతో బెదిరింపులు – వాంఖడే
సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఆఫీసర్
Sameer Wankhede : మాజీ ఎన్సీబీ ఆఫీసర్ సమీర్ వాంఖడేకు బెదిరింపులు వచ్చాయా. అవుననే అంటున్నారు ఆయన. తనకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి చంపుతామంటూ హెచ్చరించారంటూ వాపోయాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన డ్రగ్స్ కేసుకు సంబంధించి సీబీఐతో విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడిని డ్రగ్స్ కేసులో ఇరికించాడు.
ఇదే సమయంలో బయటకు తీసుకు రావడానికి కొన్ని కోట్లు లంచంగా డిమాండ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎన్సీబీ మాజీ డైరెక్టర్ అయిన సమీర్ వాంఖడేపై(Sameer Wankhede) సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు విచారణ కూడా ప్రారంభించింది. ఈ తరుణంలో సమీర్ వాంఖడే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
దావూద్ ఇబ్రహీం పేరుతో తనకు వచ్చిన బెదిరింపుల గురించి తాను సీబీఐకి వివరించినట్లు తెలిపారు సమీర్ వాంఖడే. నకిలీ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు సమీర్ వాంఖడే. ఇందుకు సంబంధించి ముంబై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనపై లేదా తన కుటుంబంపై దాడి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించాడు.
కాగా డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను ఇరికించకుండా ఉండేందుకు రూ. 25 కోట్లు లంచంగా డిమాండ్ చేసినందుకు సమీర్ వాంఖడే పై సీబీఐ కేసు నమోదు చేసింది.
Also Read : David Warner