CM Nitish Kumar : బ్రిడ్జి కూలిన ఘ‌ట‌న‌లో చ‌ర్య‌లు త‌ప్ప‌వు

స్ప‌ష్టం చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్

CM Nitish Kumar : బీహార్ లోని గంగాన‌దిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఉన్న‌ట్టుండి పేక మేడ‌లా కూలి పోయింది. ఈ ఘ‌ట‌న‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్(CM Nitish Kumar) స్పందించారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. ఎవ‌రైనా స‌రే ఏ స్థాయిలో ఉన్న వారైనా స‌రే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు సీఎం. 2014 నుండి నిర్మించిన 3.16 కిలోమీట‌ర్ల వంతెన 14 నెల‌ల్లో రెండు సార్లు కూలి పోయింది. మొద‌టిది భాగ‌ల్పూర్ సుల్తాన్ గంజ్ వైపు ఏప్రిల్ 2022లో కూలింది.

రెండోసారి ఆదివారం సాయంత్రం ఖ‌గారియా వైపు కుప్ప కూలింది. భారీ వంతెన కుప్ప కూలిన ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఇందుకు సంబంధించి తీవ్రంగా స్పందించారు నితీశ్ కుమార్. ఈ ఘ‌ట‌న‌లో దోషులుగా తేలిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం హెచ్చ‌రించారు. గ‌త ఏడాది కూడా కుప్ప కూలింద‌న్నారు.

బ్రిడ్జిని స‌రిగా నిర్మించ లేదు. అందుకే ఏప్రిల్ 2022 నుండి ఇది రెండుసార్లు కూలి పోయింద‌ని పేర్కొన్నారు. ఇది తీవ్ర‌మైన విష‌యం. సంబంధిత శాఖ ఇప్ప‌టికే దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ ప్రారంభించింద‌ని చెప్పారు నితీశ్ కుమార్. దోషులుగా తేలిన వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు

Also Read : Mukhthar Ansari : గ్యాంగ్ స్ట‌ర్ అన్సారీకి జీవిత ఖైదు

 

Leave A Reply

Your Email Id will not be published!