Arvind Kejriwal : అఖిలేష్ ను క‌ల‌వ‌నున్న కేజ్రీవాల్

ఆర్డినెన్స్ కు వ్య‌తిరేకంగా మ‌ద్ద‌తు ఇవ్వాలి

Arvind Kejriwal : ఆప్ క‌న్వీన‌ర్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) జూన్ 7న యూపీకి వెళ్ల‌నున్నారు. ఈ సంద‌ర్బంగా స‌మాజ్ వాది పార్టీ చీఫ్‌, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ తో భేటీ కానున్నారు. కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ , ఎంపీలు సంజ‌య్ సింగ్ , రాఘ‌వ్ చ‌ద్దా కూడా వెళ్ల‌నున్నారు. ఢిల్లీ స‌ర్కార్ కు ఉన్న అధికారాల‌ను తొల‌గిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు వ‌చ్చింది. ఇది చ‌ట్టంగా అమ‌లు కావాలంటే లోక్ స‌భ తో పాటు రాజ్య స‌భ‌లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. లోక్ స‌భ‌లో బీజేపీకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ ఉంది. కానీ రాజ్య‌స‌భ‌లో లేదు.

దీంతో ఆర్డినెన్స్ వీగి పోయేలా ప్ర‌తిపక్షాలతో కలిసి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇప్ప‌టికే అర‌వింద్ కేజ్రీవాల్ బీహార్ సీఎం నితీశ్ కుమార్, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, శివ‌సేన పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ను క‌లిశారు. మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు కూడా కావాల‌ని కోరారు. కాగా ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.

ఇదే క్ర‌మంలో స‌మాజ్ వాదీ పార్టీకి సంబంధించి ప‌లువురు ఎంపీలు రాజ్య‌స‌భ‌లో ఉన్నారు. వారి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు ఆ పార్టీ చీఫ్ తో భేటీ కానున్నారు అర‌వింద్ కేజ్రీవాల్. ఈ విష‌యాన్ని ఎస్పీ ముఖ్య అధికార ప్ర‌తినిధి రాజేంద్ర చౌద‌రి వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ధ్రువీక‌రించారు. ఇప్ప‌టికే సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా మ‌ద్ద‌తు తెలిపారు.

Also Read : Wrestlers Protest

 

Leave A Reply

Your Email Id will not be published!