CM YS Jagan : పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించిన సీఎం

నిర్మాణ ప‌నుల ప్ర‌గ‌తి పై ఆరా తీసిన జ‌గ‌న్

CM YS Jagan : ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన పోల‌వ‌రం ప్రాజెక్టును మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(CM YS Jagan). ఎగువ కాఫ‌ర్ డ్యాం, దిగువ కాఫ‌ర్ డ్యాం, దెబ్బ‌తిన్న డ‌యాఫ్రం వాల్ వ‌ద్ద జ‌రుగుతున్న ప‌నుల‌ను స‌మ‌గ్రంగా జ‌గ‌న్ ప‌రిశీలించారు. గ‌త సీజ‌న్ లో అనూహ్యంగా వ‌చ్చిన వ‌ర‌ద ఉదృతిని త‌ట్టుకునేలా నిర్మాణం చేప‌ట్టడాన్ని కూడా ద‌గ్గ‌రుండి చూశారు. అనంత‌రం ఇటీవ‌ల నిర్మాణం పూర్తి చేసుకున్న దిగువ కాఫ‌ర్ డ్యాం ను కూడా చూశారు.

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌ణాళికా లోపం వ‌ల్ల దెబ్బ‌తిన్న డ‌యా ఫ్రం వాల్ పై ఫోక‌స్ పెట్టారు. అనంత‌రం ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాల‌పై అధికారుల‌తో చ‌ర్చించారు సీఎం జ‌గ‌న్ రెడ్డి. పోల‌వ‌రం ప్రాజెక్టులో తొలి ద‌శ‌ను పూర్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన నిధుల‌ను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింద‌న్నారు. రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ఆర్థిక శాఖ మెమోరాండం జారీ చేసింద‌న్నారు. దీన్ని కేంద్ర జ‌ల శాఖకు లేఖ ద్వారా తెలియ చేసింద‌ని సీఎం జ‌గ‌న్ రెడ్డికి ఉన్న‌తాధికారులు తెలిపారు.

కాంపౌండ్ వారీ బిల్లుల చెల్లింపు వ‌ల్ల ప్రాజెక్టు నిర్మాణాలు ఆల‌స్యం అవుతున్న విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంద‌ని, కేంద్రం దీనికి సంబంధించి మిన‌హాయింపులు కూడా ఇచ్చింద‌న్నారు. కాగా గైడ్ వాల్ లో చోటు చేసుకున్న చిన్న స‌మ‌స్య‌ను విప‌క్షాలు పెద్ద‌దిగా చేసి చూపిస్తున్నాయ‌ని చెప్పారు. దీనిపై సీఎం స్పందించారు. వాటిని ప‌ట్టించు కోకుండా ముందు త్వ‌ర‌గా ప‌నులు పూర్తి చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

Also Read : YS Sharmila KCR : దొర పాల‌న‌లో క‌ళాకారుల‌కు దిక్కేది

Leave A Reply

Your Email Id will not be published!