CM Nitish Kumar : నిర్మాణ కంపెనీకి నోటీసు – సీఎం

ఇంజ‌నీర్ స‌స్పెండ్

CM Nitish Kumar : దేశంలో రెండు ఘ‌ట‌న‌లు రోజుల వ్య‌వ‌ధిలో చోటు చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కోర‌మాండ‌ల్ ఎక్స్ ప్రెస్ అదుపు త‌ప్పి ఢీకొన్న ఘ‌ట‌న కంట త‌డి పెట్టింది. ఇక బీహార్ రాష్ట్రంలో త‌ల‌పెట్టిన వంతెన ఉన్న‌ట్టుండి రెండోసారి కుప్ప కూలింది. ఎలాంటి ప్రాణ న‌ష్టం చోటు చేసుకోలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి , జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్(CM Nitish Kumar) పై ప్ర‌తిప‌క్ష పార్టీ బీజేపీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. దీనిని కొట్టి పారేశారు సీఎం.

ఇదిలా ఉండ‌గా ఎవ‌రు ఏ స్థాయిలో ఉన్నా స‌రే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు నితీశ్ కుమార్ . ఈ మేర‌కు వంతెన నిర్మాణం చేప‌ట్టిన నిర్మాణ కంపెనీకి ప్ర‌భుత్వం నోటీసు జారీ చేసింది. ఇదే స‌మ‌యంలో ఇందుకు కార‌ణ‌మైన ఇంజ‌నీర్ ను స‌స్పెండ్ చేసింది. ఇదే స‌మ‌యంలో కంపెనీని ఎందుకు బ్లాక్ లిస్టులో పెట్ట‌కూడ‌దో చెప్పాలంటూ వివ‌ర‌ణ కోరింది. దీనిపై స‌రైన స‌మాధానం రాని ప‌క్షంలో తొల‌గిస్తామ‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు సీఎం సీరియ‌స్ అయ్యారు. ఇదే బ్రిడ్జి రెండు సార్లు కూలి పోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ప‌లువురు.

ఈ వంతెన‌ను గంగా న‌దిపై నిర్మించారు. భాగ‌ల్పూర్ , ఖ‌గారియా జిల్లాల‌ను క‌లుపుతుంది. సీఎం ఆదేశాల మేర‌కు సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ ను స‌స్పెండ్ చేసిన‌ట్లు రాష్ట్ర రోడ్డు నిర్మాణ శాఖ అద‌న‌పు ముఖ్య కార్య‌ద‌ర్శి ప్ర‌త్యయ్ అమృత్ స్ప‌ష్టం చేశారు. కాంట్రాక్ట్ ను పొందిన హ‌ర్యానాకు చెందిన కంపెనీకి బీహార్ రాజ్య పుల్ నిర్మాణ్ నిగ‌మ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ షోకాజ్ నోటీసు ఇచ్చార‌ని, 15 రోజుల్లోగా స‌మాధానం ఇవ్వాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ వంతెన కోసం రూ. 1,700 కోట్లు ఖ‌ర్చు చేసింది ప్ర‌భుత్వం.

Also Read : CM YS Jagan : పోల‌వ‌రం ప్రాజెక్టును ప‌రిశీలించిన సీఎం

 

Leave A Reply

Your Email Id will not be published!