Nara Lokesh : అధికారం శాశ్వతం కాదు – లోకేష్

ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నారు

Nara Lokesh : జ‌గ‌న్ రెడ్డీ తాను ఎళ్ల‌కాలం సీఎంగా ఉంటాన‌ని క‌లలు కంటున్నాడ‌ని ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్(Nara Lokesh) . యువ గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ స్వంత ఇలాఖాలో ప‌ర్య‌టిస్తున్న లోకేష్ కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం విస్తు పోయేలా చేసింది. మంగ‌ళ‌వారం కమలాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఎవ‌రు బాబాయిని చంపారో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నిల‌దీశారు. ఎక్క‌డా బెద‌ర‌లేదు. వైఎస్ వివేకా, జ‌గ‌న్ రెడ్డి క‌లిసి ఉన్న ప్ల కార్డుల‌ను బ‌హిరంగంగానే ప్ర‌ద‌ర్శించారు. రాష్ట్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. రాచ‌రిక పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌న్నారు.

తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మృత దేహం ముందు ఉండ‌గానే లోలోప‌ట సీఎం కావాల‌నే కుట్ర‌లు ప‌న్నిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని జ‌నం ఎల్ల‌కాలం ద్రోహిగా గుర్తు పెట్టుకుంటార‌ని అన్నారు నారా లోకేష్‌. ఎమ్మెల్యేల సంత‌కాలు చేసిన సంగ‌తి మ‌రిచి పోతే ఎలా అని సీఎంను నిల‌దీశారు. త‌ల్లిని, చెల్లిని బ‌య‌ట‌కు త‌రిమేశాడ‌ని, చీక‌ట్లో త‌న‌పై కోడి గుడ్ల‌ను విసిరి వేయించిన నీచ‌మైన సంస్కృతి జ‌గ‌న్ రెడ్డిది కాదా అని నిల‌దీశాడు నారా లోకేష్‌.

ప్ర‌స్తుతం ఆయ‌న చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర 117వ రోజుకు చేరుకుంది. ఓ వైపు ఎండా కాలం అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు ఈ యువ‌నేత‌. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌డ‌ప ప‌ట్ట‌ణంలో డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు నారా లోకేష్.

Also Read : Navjyot Singh Sidhu : రాహుల్ గాంధీ ఈ దేశానికి అవ‌స‌రం

 

Leave A Reply

Your Email Id will not be published!