CM KCR : ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. ఈ మేరకు జూన్ 9న కుల వృత్తులు, చేతి వృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఇందులో విశ్వ బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కమ్మరి, మేదరి వంటి కుల వృత్తులు, చేతివృత్తులను నమ్ముకుని ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకునేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది.
వీరికి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ నిర్ణయాన్ని కేసీఆర్(CM KCR) అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల లక్షలాది మంది కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులకు మేలు చేకూరనుంది. ఇందుకు సంబంధించి విధి విధానాలను కూడా రూపొందించింది.
అర్హులైన వృత్తిదారులు తమ ఫోటో, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రంతో సహా 38 కాలమ్స్ ను నింపాల్సి ఉంటుంది. కుల వృత్తి, చేతి వృత్తులకు సంబంధించిన పని ముట్లు, ముడి సరుకు కొనుగోలుకు ఆర్థిక సాయం అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి ముహూర్తం ఖరారు చేసింది సర్కార్. ఈనెల 9న మంచిర్యాలలో జరిగే సభలో ఆవిష్కరించనున్నారు.
Also Read : Nara Lokesh : అధికారం శాశ్వతం కాదు – లోకేష్
