Farooq Abdullah : డీకేఎస్ తో ఫరూక్ అబ్దుల్లా భేటీ
ఇరు నేతలు కీలక అంశాలపై చర్చలు
Farooq Abdullah : జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) కర్ణాటకలోని బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ డీకే శివకుమార్ సారథ్యంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేసింది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బొమ్మై ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది.
224 సీట్లకు గాను 135 సీట్లతో ఏకైక పార్టీగా నిలిచింది. స్వంతంగా ఏ పార్టీపై ఆధార పడకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు సీఎంగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ తో పాటు 24 మందితో కూడిన కేబినెట్ కొలువు తీరింది.
కన్నడ కంఠీరవ స్టేడియంలో జరిగిన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, పార్టీల అధిపతులు, సీఎంలు హాజరయ్యరు. ప్రత్యేకించి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు. ఇదిలా ఉండగా అనివర్య కారణాల రీత్యా మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా హాజరు కాలేక పోయారు.
ఇవాళ ప్రత్యేకంగా బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా అబ్దుల్లాకు సాదర స్వాగతం పలికారు డీకే శివకుమార్. శాలువాతో డీకేఎస్ ను సన్మానించారు . అనంతరం గంటకు పైగా ఇద్దరు నేతలు రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయనుంది.
Also Read : Chinnajeeyar Swamy : శ్రీరాముడు ఒక్కడే నిజమైన బాహుబలి