Rahul Gandhi : తమిళనాడును చూసి నేర్చుకోవాలి – రాహుల్
వాళ్లను ఇబ్బంది పెట్టడం మానుకోవాలి
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత దేశంలో మిగతా రాష్ట్రాల కంటే తమిళనాడు ప్రజలు భిన్నమైన వారని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). కేంద్రంలో కొలువు తీరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ పదే పదే తమిళనాడు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్.
తమ ప్రాంతం పట్ల, తమకు సంబంధించిన సంస్కృతి, భాష, నాగరికత పట్ల తమిళులు కచ్చితంగా ఉంటారని స్పష్టం చేశారు. ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం విషయంలో వాళ్లను తప్పు పట్టలేమన్నారు రాహుల్ గాంధీ. వాళ్లకు తమ భవిష్యత్తు ఏమిటో తెలుసన్నారు. కానీ మోదీ , అమిత్ షా కావాలని వాళ్ల మనోభావాలతో ఆడుకోవాలని చూడడం మంచి పద్దతి కాదని సూచించారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందన్నారు. తమిళనాడు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా లొంగదన్నారు. ఈ దేశంలో తమకంటూ స్పెషల్ ఇమేజ్ ను రాష్ట్రం స్వంతం చేసుకుందని చెప్పారు రాహుల్ గాంధీ. ఇక పూర్తి విజన్ తో ఉన్నామని స్పష్టం చేశారు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపే సత్తా తనకు ఉందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Also Read : WFI Chief Case : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కేసులో ట్విస్ట్