Nara Lokesh : రాయ‌ల‌సీమ‌కు జ‌గ‌న్ చేసిందేమిటి

నిప్పులు చెరిగిన నారా లోకేష్

Nara Lokesh : టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. యువ గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా రాయ‌ల‌సీమలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు నారా లోకేష్. ఒక్క రాయ‌ల‌సీమ నుంచే జ‌గ‌న్ రెడ్డిని న‌మ్మి ఏకంగా 49 సీట్లు గెలిపించార‌ని, కానీ ఈ ప్రాంతానికి ఏం ఒర‌గ బెట్టాడ‌ని ప్ర‌శ్నించారు. ఏమైనా ప‌రిశ్ర‌మ‌లు తీసుకు వ‌చ్చాడా, ఉపాధి క‌ల్పించాడా, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను తీర్చాడా అని నిల‌దీశారు నారా లోకేష్(Nara Lokesh).

రాష్ట్రంలో రాజారెడ్డి రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇదిలా ఉండ‌గా లోకేష్ చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర ఇప్ప‌టి దాకా 123 రోజులు పూర్తి చేసుకుంది. సోమ‌వారం రాయ‌ల‌సీమ‌లోనే కొన‌సాగ‌నుంది. నిన్నంతా రాయ‌ల‌సీమ లోని క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు నారా లోకేష్ 1570 కిలోమీట‌ర్లు పూర్తి చేశారు.

ఆదివారం విడిది కేంద్రంలో రైతుల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. రాయ‌ల‌సీమ రైతుల‌కు నీళ్లు అందిస్తే బంగారం పండిస్తార‌ని అన్నారు నారా లోకేష్ ఈ సంద‌ర్బంగా. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన వెంట‌నే డ్రిప్ ఇరిగేష‌న్ ప‌ద్ధ‌తిని అమ‌లు చేస్తామ‌న్నారు. అంత దాకా ఓపిక ప‌ట్టాల‌ని కోరారు.

Also Read : Varahi Yatra : 14 నుంచి ప‌వ‌న్ వారాహి యాత్ర

 

Leave A Reply

Your Email Id will not be published!