Pawan Kalyan : ప్రజా క్షేమం కోసం పవన్ యాగం
యావత్ ప్రజానీకం బాగుండాలని
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్, నటుడు పవన్ కళ్యాణ్ సోమవారం అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా క్షేమం కోసం యాగాన్ని చేపట్టారు. ధర్మం కోసం, నీతి కోసం, సమాజం కోసం సకల జనులంతా బాగుండాలని కోరుకుంటూ ఈ ధార్మిక , ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు జనసేన పార్టీ వెల్లడించింది.
సకల ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. భారీ ఎత్తున ఈ యాగ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు పండితులు, పూజారులు, వేదమూర్తులు. ఇదిలా ఉండగా త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ చీఫ్ గా ఫుల్ ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
ఈసారి ఎలాగైనా సరే కింగ్ మేకర్ గా కావాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. మరో వైపు ఎన్నికలను పురస్కరించుకుని జనసేన ప్రచార రథాన్ని సిద్దం చేసింది. భారీ ఎత్తున దీని కోసం ఖర్చు పెట్టింది. అత్యాధునిక సౌకర్యాలతో దీనిని తయారు చేశారు.
జూన్ 14 నుంచి ఏపీలో 23 వరకు వారాహి యాత్ర కొనసాగుతుందని పార్టీ ప్రకటించింది. ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాగం చేపట్టడంతో రాజకీయ, ఇతర వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొలువుతీరిన వైసీపీ సర్కార్ ను ఏకి పారేస్తున్నారు జనసేనాని.
Also Read : PM Modi Congratulate : మీ విజయం దేశానికి గర్వకారణం