AP CM YS Jagan : ఘ‌నంగా జ‌గ‌న‌న్న విద్యా కానుక

ప్ర‌తి ఒక్క‌రు చ‌దువుకోవాలన్న సీఎం

AP CM YS Jagan : ప్రభుత్వం విద్యా రంగానికి ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని అన్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. సోమ‌వారం ఏపీలో వ‌రుస‌గా నాలుగోసారి జ‌గ‌న‌న్న విద్యా కానుక కింద కిట్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ప‌ల్నాడు జిల్లా పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలోని క్రోసూరు ఏపీ మోడ‌ల్ స్కూల్ లో కిట్ల‌ను పంపిణీ చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి(CM YS Jagan). ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా విద్యార్థినుల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. వారి అభిప్రాయాల‌ను తెలుసుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రు చ‌దువు కోవాల‌ని సూచించారు. చ‌దువుకుంటే ఉన్న‌త అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని, మ‌రింత సేవ చేసేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు. ప్ర‌భుత్వం కోట్లాది రూపాయ‌లు చ‌దువు కోసం ఖ‌ర్చు చేస్తోంద‌ని చెప్పారు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ‌, ఎయిడెడ్ బ‌డుల్లో ఒకటవ త‌ర‌గ‌తి నుంచి 10వ త‌ర‌గ‌తి దాకా చ‌దువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ విద్యార్థుల‌కు రూ. 1,042 కోట్ల‌తో జ‌గ‌న‌న్న విద్యా కానుక కిట్ల‌ను పంపిణీ చేశామ‌ని తెలిపారు సీఎం.

ఈ జ‌గ‌న‌న్న విద్యా కానుక కిట్ల‌ల‌లో టెక్ట్స్ పుస్త‌కాలు, నోట్ పుస్త‌కాలు, వ‌ర్క్ బుక్స్ , మూడు జ‌త‌ల యూనిఫామ్ క్లాత్ (కుట్టు కూలీతో స‌హా) , ఒక జ‌త , బూట్లు, రెండు జ‌త‌ల సాక్స్ , బెల్టు, స్కూల్ బ్యాగుతో పాటు ఆక్స్ ఫ‌ర్డ్ డిక్ష‌న‌రీ ( 6 నుంచి 10 పిల్ల‌ల‌కు), పిక్టోరియ‌ల్ డిక్ష‌న‌రీ ( 1 నుంచి 5 వ‌ర‌కు) తో కూడిన కిట్ల‌ను అంద‌జేస్తున్నారు.

Also Read : Priyanka Gandhi : త్యాగ‌ధ‌నుల‌కు పుట్టినిల్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్

 

Leave A Reply

Your Email Id will not be published!