CoWin Data Breach : ‘కోవిన్’ తో జ‌ర భ‌ద్రం

డేటా లీక్ పై ఆందోళ‌న

CoWin Data Breach : ఏమిటీ కోవిన్ అనుకుంటున్నారా. ఇదేదో మ‌త్తు ప‌దార్థం కాదు. కానీ అంత‌కంటే డేంజ‌ర‌స్ . ప్ర‌స్తుతం కోవిన్(Cowin) నుండి ఎవ‌రికీ తెలియ‌కుండా డేటా లీక్ అవుతోంద‌ని ప‌లువురు ఆందోళ‌న చెందుతున్నారు. వారికి సంబంధించిన వ్యక్తిగ‌త వివ‌రాలు, పూర్తి స‌మాచారం అంతా గంప గుత్త‌గా బ‌య‌ట‌కు వ‌స్తోంద‌ని వాపోతున్నారు. వీరిలో సామాన్యులే కాదు దేశానికి చెందిన వివిధ రంగాల‌కు చెందిన వారు కూడా దీని బారిన ప‌డ్డారు. ఇది ఎంత మాత్రం సుర‌క్షిత‌మైన‌ది కాదంటూ హెచ్చ‌రిస్తున్నారు.

టీఎంసీ నాయ‌కుడు సాకేత్ గోళ‌క‌లే అయితే మోదీ స‌ర్కార్ పై మండిప‌డ్డారు. ఉన్న‌త వ్య‌క్తుల‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం బ‌య‌ట‌కు వెలా పొక్కిందంటూ ప్రశ్నించారు. మొబైల్ నెంబ‌ర్లు, ఆధార్ నెంబ‌ర్లు, పాస్ పోర్టు నంబ‌ర్లు , ఓట‌రు ఐడీ , కుటుంబ స‌భ్యుల వివ‌రాలు స‌హా టీకాలు వేసిన భార‌తీయులంద‌రి వ్య‌క్తిగ‌త వివ‌రాల‌న్నీ బ‌హిర్గ‌తం అయ్యాయంటూ మండిప‌డుతున్నారు.

విచిత్రం ఏమిటంటే టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ , కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు పి. చిదంబ‌రం , ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ , జై రాం ర‌మేష్ , ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు బ‌య‌టకు వ‌చ్చాయి. వీరంతా త‌మ స్క్రీన్ షాట్స్ ను పంచుకున్నారు.

ఇదిలా ఉండ‌గా డేటా లీక్ కు సంబంధించి కేంద్ర స‌ర్కార్ పై దుమ్మెత్తి పోస్తున్నారు నేత‌లు. దీని వెనుక ఏదో చెప్ప‌కూడ‌ని ఎజెండా ఉంద‌న్న అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : CM KCR : సింగ‌రేణి కార్మికుల‌కు ఖుష్ క‌బ‌ర్

 

Leave A Reply

Your Email Id will not be published!