Amit Shah Tour : భాగ్యనగరానికి ట్రబుల్ షూటర్ రాక
అమిత్ షాను కలవనున్న ప్రముఖులు
Amit Shah Tour : తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రాజకీయాలు శరవేగంగా మారి పోతున్నాయి. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలని పావులు కదుపుతోంది భారతీయ జనతా పార్టీ. ముఖ్యలకు కీలక పదవులను కట్టబెట్టి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం కావాలని ఇప్పటి నుంచే దిశా నిర్దేశం చేస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా అటు ఏపీలో వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. మరో వైపు తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయమని చెప్పేందుకు ప్రయత్నం చేస్తోంది.
ఇందులో భాగంగా కాషాయ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) గురువారం భాగ్యనగరానికి రానున్నారు. ఆయనను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కలవనున్నారు. టూర్ సందర్భంగా రాత్రి 11.55 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు షా చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నోవా టెల్ హోటల్ లో బస చేస్తారు. పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు అమిత్ చంద్ర షా.
మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా గురువారం ఉదయం 11 గంటలకు ఏబీఎన్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ తో ఆయన నివాసంలో భేటీ అవుతారు. అక్కడి నుంచి నేరుగా మణికొండలో ఉంటున్న ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నివాసానికి చేరుకుంటారు. ఆయనతో పిచ్చాపాటి మాట్లాడతారు. మొత్తంగా అమిత్ షా రాక కీలకం కానుంది.
Also Read : Jack Dorsey Comment : ఉక్కుపాదం వివాదాస్పదం