KTR Telangana : ప్ర‌జారోగ్యంలో తెలంగాణ టాప్

స్ప‌ష్టం చేసిన మంత్రి కేటీఆర్

KTR Telangana : తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ఐటీ, పుర‌పాలిక‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు రాష్ట్రంలో నిర్మించిన ఆస్ప‌త్రుల భ‌వ‌నాల‌కు సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. ఈ సంద‌ర్బంగా కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ఆరోగ్యం అంటే గాలిలో దీపం లాగా ఉండేద‌న్నారు. కానీ ఇప్పుడు ఎక్క‌డ చూసినా మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాల‌తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానిదేన‌ని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్(KTR).

ప్ర‌భుత్వ వైద్య రంగానికి సంబంధించి కొత్త రూపం తీసుకు రావ‌డం వ‌చ్చింద‌ని తెలిపారు. గ‌తంలో పాల‌కులు తాము బాగు ప‌డ‌టానికి మాత్ర‌మే స‌మయాన్ని వెచ్చించార‌ని ప్ర‌జ‌ల గురించి, వారి ఆరోగ్యం గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. కానీ సీఎం కేసీఆర్ సార‌థ్యంలోని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం విద్య‌, వైద్య రంగాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌డం జ‌రిగిందని తెలిపారు కేటీఆర్.

గ‌తంలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు వెళ్లాలంటే జ‌నం , బాధితులు జంకే వార‌ని కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌న్నారు. ప్ర‌స్తుతం సీన్ మారింద‌న్నారు. ఎవ‌రు ఎప్పుడు వ‌చ్చినా స‌రే నేరుగా వెళ్లేందుకు ఆస్కారం ఉంద‌ని తెలిపారు కేటీఆర్. కేసీఆర్ కిట్ల నుంచి న్యూట్రిష‌న్ కిట్ల దాకా , డయాల‌సిస్ సెంట‌ర్ల నుంచి డ‌యాగ్నొస్టిక్ కేంద్రాల వ‌ర‌కు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ ప్ర‌స్థానం ప‌రంగా చూస్తే దేశంలోనే టాప్ లో కొన‌సాగుతోంద‌ని తెలిపారు కేటీఆర్.

Also Read : Justice Madan Lokur : రెజ్ల‌ర్ల‌పై ఖాకీల దాడులు దారుణం – లోకూర్

 

 

Leave A Reply

Your Email Id will not be published!