IT Raids : బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల‌కు ఐటీ షాక్

కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి

IT Raids : త్వ‌ర‌లో రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో ఇప్ప‌టి నుంచే ఐటీ శాఖ న‌జ‌ర్ పెట్టింది. ప్ర‌త్యేకించి ఆదాయ ప‌న్ను శాఖ అధికారంలో ఉన్న భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల‌ను టార్గెట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. నిన్న‌టి దాకా తెలంగాణ రాష్ట్ర ద‌శాబ్ది ఉత్సవాలు, సంబురాల‌లో మునిగి పోయిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఐటీ. బుధ‌వారం తెల్లవారుజాము నుంచే దాడుల ప‌రంప‌ర మొద‌లైంది.

వ‌రుస పెట్టి దాడుల‌కు దిగ‌డంతో ఎంపీ, ఎమ్మెల్యేలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున ఎలా ఆస్తుల‌ను, న‌గదును, ఆభ‌ర‌ణాల‌ను కూడ‌గ‌ట్టార‌నే దానిపై ఐటీ ఆరా తీస్తోంది. ఓ వైపు త‌మిళ‌నాడులో ఆ రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసింది. ఇదే క్ర‌మంలో తెలంగాణ‌లో గురువారం ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షా రానున్నారు. అయితే ఐటీ దాడుల‌కు దిగ‌డం ఒక్క‌సారిగా ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

ఇక ఐటీ(IT) ఝ‌ల‌క్ ఇచ్చిన వారిలో సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు అత్యంత స‌న్నిహితులు కావ‌డం విశేషం. ఒక‌రు ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి కాగా మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, నాగ‌ర్ క‌ర్నూల్ కు చెందిన బ‌ట్ట‌ల వ్యాపారి మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి. వారి వ్యాపార కార్యాల‌యాలు, బంధువులు, స‌న్నిహితుల ఇళ్ల‌ను కూడా జ‌ల్లెడ ప‌డుతుండ‌డం విశేషం.

Also Read : Vijay Devarakonda : విజ‌య్ తో ప‌రుశురామ్ సినిమా

 

Leave A Reply

Your Email Id will not be published!