RS Praveen Kumar : ఎక్క‌డుంది ఆరోగ్య తెలంగాణ – ఆర్ఎస్పీ

బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై సీరియ‌స్ కామెంట్స్

RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాల పేరుతో ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్య దినోత్స‌వాన్ని జ‌రుపు కోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. సీఎం కేసీఆర్ చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్దాలేన‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ లోని నాలుగు మూల‌ల్లో నాలుగు సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రులు నిర్మిస్తున్నార‌ని అవి ఎక్క‌డ ఉన్నాయ‌ని ప్ర‌శ్నించారు ఆర్ఎస్పీ.

ప్ర‌తి జిల్లాలో నిమ్స్ త‌ర‌హా ఆస్ప‌త్రులు నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని , వాటిని మ‌రిచి పోతే ఎలా అని మండిప‌డ్డారు. ఇక టిమ్స్ స్థితి ఎక్క‌డ ఉంద‌న్నారు. ఎంత మంది ఔట్ పేషంట్లు, ఇన్ పేషంట్లు ఉన్నారో చెప్పాల‌న్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar). ఆరోగ్య రంగానికి సంబంధించి బ‌డ్జెట్ లో ఎందుకు త‌క్కువ‌గా కేటాయించారో ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో వైద్య రంగాన్ని పూర్తిగా నిర్ల‌క్ష్యం చేశారంటూ ఆరోపించారు బీఎస్పీ చీఫ్.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్న‌తాధికారులు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌లో చూపించుకున్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ద‌వాఖానాల్లో వ‌స‌తి సౌక‌ర్యాలు ఉంటే ఢీల్లీకి, య‌శోద ఆస్ప‌త్రుల‌కు ఎందుకు వెళుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : IT Raids : బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల‌కు ఐటీ షాక్

 

Leave A Reply

Your Email Id will not be published!