Ghulam Nabi Azad : ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త వ‌ల్ల లాభం లేదు

గులాం న‌బీ ఆజాద్ షాకింగ్ కామెంట్స్

Ghulam Nabi Azad : డెమోక్ర‌టిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్ గులాం న‌బీ ఆజాద్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిపక్షాలు సమావేశం కానున్నాయి. ఇప్ప‌టికే తేదీ కూడా ఖ‌రారైంది. ఇందుకు సంబంధించి మీకు ఏమైనా స‌మాచారం అందిందా అన్న ప్ర‌శ్న‌కు ఆజాద్ లేద‌న్నారు. అయితే విప‌క్షాలు ప్ర‌స్తుతం ఐక్యం కావ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

ఎవ‌రికి వారు ఇప్పుడు ఉన్నార‌ని, ఆయా రాష్ట్రాల‌లో త‌మ ప్రాబ‌ల్యాన్ని పెంచుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ త‌రుణంలో భిన్న‌మైన అభిప్రాయాలు, సిద్దాంతాలు, ఆధిప‌త్య భావ‌జాలాలు క‌లిగి ఉన్న ప‌లు పార్టీలు, నేత‌లు క‌లుస్తార‌ని, ఒకే మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటార‌ని తాను అనుకోవ‌డం లేద‌న్నారు గులాం న‌బీ ఆజాద్(Ghulam Nabi Azad).

దేశంలో ఆక్టోప‌స్ కంటే స్పీడ్ గా భార‌తీయ జ‌న‌తా పార్టీ విస్త‌రించింద‌ని దానిని ఢీకొనాలంటే స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం విప‌క్షాల నుంచి కావాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. క‌ర్ణాట‌క‌లో గెలుపొందినంత మాత్రాన రేపొద్దున మిగ‌తా చోట్ల గెలుస్తుంద‌ని అనుకోవ‌డానికి వీలు లేద‌న్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ విప‌క్షాలు ముందు త‌మ త‌ర‌పున ప్ర‌ధాన నాయ‌కుడు ఎవ‌రో స్ప‌ష్టం చేస్తే కానీ జ‌నం న‌మ్మ‌ర‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు గులాం న‌బీ ఆజాద్.

Also Read : Perni Nani : ప‌వ‌న్ పౌరుషం లేనోడు – పేర్ని నాని

Leave A Reply

Your Email Id will not be published!