Bhatti Vikramarka : పేదల భూములు గుంజుకుంటే ఖబడ్దార్
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్రంలో పేదల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ యాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ధరణి పేరుతో దొరలకు, భూస్యాములకు మేలు చేకూర్చేలా సీఎం కేసీఆర్ కుట్రకు తెర తీశాడని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు మల్లు భట్టి విక్రమార్క.
కాంగ్రెస్ పార్టీ దళితులకు , పేదలకు భూములు ఇచ్చిందని కానీ దొర పాలన వచ్చాక వాటిపై కన్నేశారంటూ మండిపడ్డారు. తాము అధికారంలోకి రావడం వచ్చాక కేసీఆర్ తీసుకు వచ్చిన ధరణిని రద్దు చేస్తామని మరోసారి ప్రకటించారు మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). పేదల భూములు గనుక అక్రమంగా తీసుకుంటే వాటిని తిరిగి తీసుకునేంత వరకు తాను నిద్ర పోనంటూ హెచ్చరించారు.
ఏపీ ఉమ్మడి రాష్ట్రం విడి పోయిన సమయంలో తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉండేదని కానీ ఇవాళ కేసీఆర్ కొలువు తీరిన 9 ఏళ్ల కాలంలో ఏకంగా 5 లక్షల కోట్లకు అప్పులు చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు సీఎల్పీ నేత. సంక్షేమ పథకాల పేరుతో మోసం చేస్తూ మరోసారి ఓట్ల రాజకీయం చేస్తున్నాడంటూ సీఎంపై నిప్పులు చెరిగారు సీఎల్పీ నేత.
తాము వచ్చాక ధరణిపై విచారణకు ఆదేశిస్తామని , దాదాపు రూ. 50 వేల కోట్ల లావాదేవీలు జరిగినట్లు అనుమానం ఉందన్నారు. మొత్తం 25 లక్షల ఎకరాల లావాదేవీలు జరిగాయని వాటిపై ఆరా తీస్తామని చర్యలు తీసుకుంటామన్నారు మల్లు భట్టి విక్రమార్క.
Also Read : Dokka Manikya Vara Prasad : తెలుగుదేశం ఓట్ల రాజకీయం