Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ పాలనలో భాగ్యనగరం ఆగమాగమైందని మండిపడ్డారు. ఇప్పటికే ఎండలు కొనసాగుతున్నా త్వరలో వర్షాలు వస్తాయని ఇక నరకం తప్ప ఇంకేమీ ఉండదని ఆరోపించారు. వానలు వస్తే వరదలు రావడం ఖాయమన్నారు. రోడ్ల పైన ట్రాఫిక్ ఏర్పడుతుందని, ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొన్నారు బండి సంజయ్.
హుస్సేన్ సాగర్ పూర్తిగా మురికి మయంగా తయారైందని ఆరోపించారు . మూసీ నది ఇంకా శుభ్రం కాలేదన్నారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ ఉండీ ఏం చేస్తోదంటూ ప్రశ్నించారు. వరంగల్ ను ఇస్తాంబుల్ చేస్తానని చెప్పిన దొర ఇప్పుడు గనుక ఉన్నట్టుండి వర్షం వస్తే వరద తప్ప, కొట్టుకు పోవడం తప్ప ఇంకేమీ జరగదని ఎద్దేవా చేశారు బండి సంజయ్(Bandi Sanjay) .
ఇక నగరం పరిస్థితి నరక యాతనగా ఉంటే పట్టణాల్లో పరిస్థితులు అంతకంటే అధ్వాన్నంగా, దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని మండిపడ్డారు బీజేపీ స్టేట్ చీఫ్. డల్లాస్ , లండన్ ముచ్చట్లతో మోసం చేయడం వానలు అయి పోయాక చేతులు దులుపు కోవడం దొరకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పట్టణ ప్రగతి కాదు పట్టణాలకు పట్టిన దుర్గతి అని సెటైర్ వేశారు.
Also Read : Nara Lokesh : జగన్ పాలనలో రైతులు ఆగమాగం