DK Shiva Kumar : గృహ ల‌క్ష్మి యోజ‌న‌కు ఢోకా లేదు

డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్

DK Shiva Kumar : క‌ర్ణాట‌క‌లో గృహ ల‌క్ష్మి యోజ‌న ప‌థ‌కానికి ఎలాంటి ఢోకా లేద‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్. శుక్ర‌వారం ప్రియాంక ఖ‌ర్గేతో పాటు లక్ష్మీ హెబ్బాల్క‌ర్ తో క‌లిసి రాష్ట్రంలో ప్ర‌వేశ పెట్టిన గృహ ల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు తీరుపై స‌మీక్షించారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా తాము ప్ర‌క‌టించిన గ్యారెంటీ హామీల‌లో ఇది కూడా ఒక‌టి అని స్ప‌ష్టం చేశారు.

దీనిని ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. నిజ‌మైన ల‌బ్దిదారులు ఎవ‌రో గుర్తించాల‌ని, త‌ద్వారా ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్దిదారులు ల‌బ్ది పొందేలా చూడాల‌ని సూచించారు. ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు తెప్పించు కోవాల‌ని, ఏ ఒక్క‌రు ఇబ్బంది ప‌డ‌కుండా ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన గృహ ల‌క్ష్మి ప‌థ‌కం ద్వారా ల‌బ్ది పొందేలా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు డీకే శివ‌కుమార్(DK Shiva Kumar).

రాష్ట్రంలో మ‌హిళ‌లు అత్య‌ధికంగా ఉన్నార‌ని, వారు ఈ స‌మాజంలో త‌మ వంతు పాత్ర పోషిస్తున్నార‌ని చెప్పారు. వారు త‌మ కాళ్ల మీద తాము నిల‌బ‌డేలా చేసేందుకే ఈ గృహ ల‌క్ష్మి ప‌థ‌కాన్ని రూపొందించ‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం.

దీని ద్వారా మ‌హిళ‌లకు భ‌ద్ర‌త క‌లుగుతుంద‌ని, ఆర్థికంగా వారికి భ‌రోసా ఇవ్వ‌డం వ‌ల్ల మ‌రింత‌గా ఎదిగేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌ని అన్నారు డీకే శివ‌కుమార్. త‌మ స‌ర్కార్ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Bandi Sanjay : వానొస్తే క‌ష్టం భాగ్య‌న‌గ‌రం న‌రకం

Leave A Reply

Your Email Id will not be published!