RS Praveen Kumar : ఇథ‌నాల్ కంపెనీతో ప్రాణాల‌కు ముప్పు

బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar : బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఇథ‌నాల్ కంపెనీ ఏర్పాటుతో ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ముప్పు ఏర్ప‌డుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శుక్ర‌వారం పాశిగామ గ్రామంలో ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీ వ‌ల్ల 115 ఎక‌రాలు కోల్పోయారు గ్రామ‌స్థులు. బాధితుల‌తో నేరుగా ప‌రామ‌ర్శించారు బీఎస్పీ చీఫ్‌. ఇథ‌నాల్ కంపెనీ ఏర్పాటు చేస్తే గోదావ‌రి జ‌లాలు క‌లుషితం అవుతాయ‌ని పేర్కొన్నారు. దీనిని వాడే వారి ప్రాణాల‌కు ముప్పు ఏర్పడుతుంద‌ని, ఇంత జ‌రుగుతున్నా ఎలా ప‌ర్మిష‌న్ ఇచ్చారంటూ ప్ర‌శ్నించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

ఇదిలా ఉండ‌గా పాశిగామ‌, స్తంభంప‌ల్లిలో ఇథ‌నాల్ కంపెనీ వ‌ద్దంటూ గ‌త మూడు నెల‌లుగా ఆందోళ‌న చేప‌ట్టారు ఆయా గ్రామాల ప్ర‌జ‌లు. ఇథ‌నాల్ కెమిక‌ల్ ప‌రిశ్ర‌మ వ‌ల్ల గాలి, నీరు, భూమి క‌లుషితం అవుతాయ‌ని అన్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar). ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీ నిర్వాసితుల కన్నీళ్లు గోదావ‌రిలో వ‌ర‌ద‌లై పారుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌క్కువ ధ‌ర‌ల‌కు భూములు కొనుగోలు చేసి రూ. 700 కోట్ల‌తో ఇథ‌నాల్ కంపెనీ ఏర్పాటు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఈ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తే దాదాపు 10 గ్రామాలు దిక్కులేనివి అవుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పేద‌ల భూములు లాక్కుంటున్న వాళ్లు ఎందుక‌ని కేటీఆర్, కేసీఆర్ ఫామ్ హౌస్ ల‌ను స్వాధీనం చేసుకోవ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు.

Also Read : Karnataka Govt : క‌ర్ణాట‌క‌లో 8 మంది ఇంజనీర్ల‌పై వేటు

 

Leave A Reply

Your Email Id will not be published!