Pawan Kalyan : జవాబుదారీతనం జనసేన లక్ష్యం
రాబోయేది జనసేన పాలనే
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేపట్టిన వారాహి విజయ యాత్ర ఏపీలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన వివిధ వర్గాలకు చెందిన మేధావులు, లాయర్లు, డాక్టర్లు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. వారితో కూలంకుశంగా చర్చిస్తున్నారు. వారు అందించిన సూచనలు, సలహాలను తీసుకుంటున్నారు. శ్రద్ధగా నోట్స్ రాసుకుంటున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. రాబోయేది జనసేన పాలన అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). జనసేన పాలనలో పూర్తిగా జవాబుదారీతనంతో ఉంటుందని స్పష్టం చేశారు. స్వచ్ఛత, బాధ్యత, పారదర్శకతతతో వ్యవహరిస్తామని చెప్పారు. శనివారం కాకినాడ నగర ప్రముఖులు, మేధావులు పవన్ కళ్యాణ్ తో సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయని, వాటిని గుర్తించి వాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇవాల్టి వరకు ఏపీ సీఎం ప్రజలకు ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. తాను ప్రజల మనిషినని, కానీ తన జోలికి వస్తే మాత్రం ఊరుకోనంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్. చిల్లర రాజకీయాలు చేస్తే తాట తీస్తానంటూ మండిపడ్డారు జనసేన చీఫ్.
Also Read : Raghav Chadha : తమిళనాడు గవర్నర్ పై చద్దా ఫైర్