Adipurush Record : వసూళ్లలో ఆది పురుష్ రికార్డ్
రెండు రోజుల్లో రూ. 240 కోట్లు
Adipurush Record : ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ , కృతీ సనన్ కలిసి నటించిన ఆది పురుష్ ఊహించని రీతిలో వసూళ్లను రాబడుతోంది. చిత్రం విడుదల తర్వాత మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రాన్ని మూవీ మేకర్స్ రూ. 500 కోట్లు పెట్టి తీశారు. దేశంలోని కాషాయ శ్రేణులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ప్రభాస్ నటన, అత్యాధునిక రీతిలో వాడిన గ్రాఫిక్స్ ఆది పురుష్ కు హైలెట్ గా నిలిచాయి. పాత్రల విషయంలో కొంత ఇబ్బందికరంగా అనిపించినా ఆ తర్వాత మెల మెల్లగా టాక్ పాజిటివ్ లోకి వచ్చింది.
ఇదిలా ఉండగా ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆదిపురుష్(Adipurush) మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తమ చిత్రం మెస్మరైజ్ చేస్తోందని తెలిపారు. మొదటి రోజున రూ. 140 కోట్లు వసూలు చసిందని స్పష్టం చేశారు. ఓపెనింగ్ తో అంచనాలను మించి పోయిందని పేర్కొన్నారు. ఇక రెండో రోజున రూ.100 కోట్లు జోడించింది ఈ సినిమా. దీంతో కేవలం రెండు రోజుల్లోనే మొత్తం కలెక్షన్ ను రూ. 240 కోట్లకు తీసుకు వెళ్లిందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా దర్శకుడు ఓం రౌత్ సంచలన ప్రకటన చేశారు విడుదలకు ముందు. ప్రతి థియేటర్ లో భజ్ రంగ్ హనుమాన్ కోసం ఒక సీటు ఖాళీగా ఉంచాలని పిలుపునిచ్చారు. దీనికి భారీ ఎత్తున స్పందన లభించింది.
Also Read : CM Siddaramaiah : అసమానతలు లేని సమాజం కావాలి