Visakhapatnam Port : స‌రుకు ర‌వాణాలో విశాఖ పోర్టు రికార్డ్

17న 4,01,875 మెట్రిక్ ట‌న్నుల స‌రుకు ర‌వాణా

Visakhapatnam Port : స‌రుకు ర‌వాణాలో అరుదైన రికార్డు న‌మోదు చేసింది ఏపీలోని విశాఖ‌ప‌ట్ట‌ణం పోర్టు (ఓడ రేవు). గ‌తంలో ఉన్న పాత రికార్డుల‌ను తిర‌గ రాసింది. విశాఖ ఓడ రేవు ఆవిర్భ‌వించిన త‌ర్వాత ఒక్క రోజులో అత్య‌ధిక స‌రుకు ర‌వాణాను చేసిన ఘ‌న‌త‌ను సాధించింది. జూన్ 17న శ‌నివారం ఏకంగా ,01,875 మెట్రిక్ ట‌న్నుల స‌రుకును 23 షిప్పుల నుంచి వివిధ బెర్త్ ల ద్వారా హ్యాండిల్ చేసింది. స‌రికొత్త చ‌రిత్ర‌కు నాంది ప‌లికింది.

ఇదే ఏడాది మే 7న పోర్టు లోని వివిధ బెర్త్ ల ద్వారా 27 షిప్ ల నుంచి చేసిన 3, 78 , 760 మెట్రిక్ ట‌న్నుల స‌రుకు ర‌వాణా చేసింది. ఇదే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రోజులో పోర్ట్ చేసిన అత్య‌ధిక స‌రుకు ర‌వాణాగా రికార్డులలో నిలిచి ఉంది.

కాగా విశాఖప‌ట్ట‌ణం పోర్టు(Visakhapatnam Port) నూత‌న రికార్డుల‌ను సాధించ‌డం ప‌ట్ల పోర్టు అథారిటీ చైర్మ‌న్ డాక్ట‌ర్ ఎం అంగ‌ముత్తు పోర్టు ట్రాఫిక్ మేనేజ‌ర్ శ్రీ ర‌త్న శేఖ‌ర్ , సిబ్బందిని ప్ర‌శంసించారు. పోర్టు సిబ్బంది క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయ‌డం ద్వారా మ‌రిన్నికొత్త రికార్డుల‌ను తిర‌గ రాయ‌వ‌చ్చ‌ని ఈ సంద‌ర్భంగా పోర్టు చైర్మ‌న్ స్ప‌ష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి రికార్డులు మ‌రెన్నో సాధించాల‌ని కోరారు.

Also Read : Sanjay Singh : మ‌ణిపూర్ మండుతున్నా మోదీ మౌనం

Leave A Reply

Your Email Id will not be published!