Jairam Ramesh Modi : ప్రధానమంత్రి కాదు ప్రచారమంత్రి
కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కామెంట్స్
Jairam Ramesh Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీడియా ఇంఛార్జ్ జైరాం రమేష్(Jairam Ramesh Modi). ఆయన ఆదివారం ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. మణిపూర్ లో గత కొన్ని రోజులుగా హింసోన్మాదంతో రగిలి పోతోందని, అక్కడ కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కాషాయ శ్రేణులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. 45 రోజుల తర్వాత ఆర్ఎస్ఎస్ శాంతి ప్రవచనాలు వల్లె వేస్తోందని మండిపడ్డారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రచారంపై ఉన్నంత మక్కువ ఈ దేశంపై లేదని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆయనను పీఎం కాదని ప్రచార మంత్రి అని పిలుస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే మణిపూర్ ఇంకా రగులుతూనే ఉందన్నారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన చెందారు.
ఏకంగా 60 వేల మంది రాష్ట్రం విడిచి భయంతో వెళ్లి పోయారని, ఇంకా ఆస్తులు దగ్ధం అవుతూనే ఉన్నాయని ఎందుకని ప్రధాన మంత్రి మౌనం వహిస్తున్నారంటూ నిలదీశారు. బీజేపీ మాతృ సంస్థ ప్రతిదానికీ రాద్దాంతం చేసే ఆర్ఎస్ఎస్ , దాని చీఫ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. జాతుల మధ్య, మనుషుల మధ్య విద్వేషాలను రగిల్చి ఓట్ల రాజకీయం చేసే బీజేపీకి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు జై రామ్ రమేష్.
Also Read : Congress Slams : మోదీ మౌనం దేశానికి శాపం