RS Praveen Kumar : బహుజనులు ఏకమైతేనే రాజ్యాధికారం
RS Praveen Kumar : బహుజనులంతా ఏకమైతేనే రాజ్యాధికారం సిద్దిస్తుందని అన్నారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆనాడే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కన్న కలలు, ఆశయాలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా తూంపల్లిలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ చేసిన శ్రమ, కృషి వల్లనే దేశానికి గొప్పనైన రాజ్యాంగం సమకూరిందని చెప్పారు.
భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన మానవ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం లభించాయని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ హక్కుల కోసం తన జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు . ఆయన లేక పోతే ఇవాళ బహుజనులు బానిసలకంటే హీనంగా ఉండేవాళ్లమని పేర్కొన్నారు.
దేశంలోని కార్మికులు, మహిళలకు హక్కులు ప్రసాదించిన గొప్ప వ్యక్తి అని , మనమందరం ఆయనకు రుణపడి ఉండాలన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును నోట్లకు, మద్యానికి కాకుండా ఆత్మ గౌరవంతో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శ ప్రాయమన్నారు. కులమతాలకు అతీతంగా మనుషలందరినీ సమానంగా గౌరవించక పోతే విగ్రహం పెట్టి అర్థం లేదన్నారు ఆర్ఎస్పీ.
Also Read : Rakesh Master : కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కన్నుమూత