Rakesh Tikait : సీఎం ధామితో టికాయత్ భేటీ
రైతుల సమస్యలపై చర్చ
Rakesh Tikait : భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి, సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ టికాయత్ మర్యాద పూర్వకంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం పలికారు ధామి. రాష్ట్రానికి సంబంధించిన రైతుల హిల్ పాలసీ , రవాణా సబ్సిడీ , హోమ్ స్టే పాలసీ , ఇక్బాల్ పూర్ షుగర్ మిల్ చెరకు చెల్లింపుతో సహా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా రైతు నేత రాకేష్ టికాయత్ ప్రస్తావించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని వీటిపై సమగ్ర సమాచారం తెప్పించుకుంటామని, కేబినెట్ లో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు రాకేశ్ టికాయత్(Rakesh Tikait) కు. యూపీ నుంచి వచ్చి తనను కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు సీఎం.
రాకేష్ టికాయత్ ఒక్కసారి పట్టుకున్నారంటే దానిని సాధించేంత దాకా వదలరని కితాబు ఇచ్చారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన రైతు ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలిచాడు టికాయత్. చివరకు కేంద్ర సర్కార్ తలవంచేలా , చట్టాలను రద్దు చేసేలా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇవాళ రైతుల తరపున వాయిస్ వినిపంచే ఏకైక ధిక్కార స్వరం టికాయత్.
Also Read : Sharad Pawar KCR : బీఆర్ఎస్ బీజేపీకి ‘బి’ టీమ్ – పవార్