PM Modi To Lead : యుఎన్ లో యోగా సెష‌న్ కు మోదీ

తొలిసారిగా ప్ర‌ధాన‌మంత్రి నేతృత్వం

PM Modi To Lead : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను స్వంతం చేసుకోనున్నారు. ఆయ‌న చొర‌వ వ‌ల్ల‌నే యోగాకు అంత‌ర్జాతీయ ప‌రంగా గుర్తింపు ల‌భించింది. అంతే కాదు తృణ ధాన్యాల‌ను సంర‌క్షించు కోవాల‌ని, వీటిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌పంచంలోని ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌ని ఆయ‌న ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చారు. ఇటీవ‌లే ప్ర‌ముఖ గ్రామీ అవార్డు విజేత సింగ‌ర్ ఫాలు తో క‌లిసి మిల్లెట్స్ సాంగ్ కు మ‌ద్ద‌తు తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి మోదీ.

తాజాగా ఐక్య రాజ్య స‌మితిలో జూన్ 21న యోగా దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్బ‌గా ప్ర‌త్యేకంగా యోగా కు సంబంధించి సెష‌న్ ను ఏర్పాటు చేసింది యుఎన్ఓ. ఇందులో భాగంగా ఆయ‌న యోగా కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన‌మంత్రి(PM Modi) స్వ‌యంగా నేతృత్వం వ‌హించ‌నున్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా వెల్ల‌డించింది.

ప్ర‌తి ఏటా జూన్ నెల‌లో యోగా అంత‌ర్జాతీయ దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్నార‌ను. న్యూయార్క్ లోని యుఎన్ఓ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఈ అరుదైన ప్రోగ్రామ్ కు వేదిక కానుంది. యోగా సాధ‌న వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ఈ దినోత్స‌వం ముఖ్య ఉద్దేశం. గ‌త కొన్నేళ్లుగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ యోగాను ప్రాక్టీస్ చేస్తూ వ‌స్తున్నారు. ఇదిలా ఉండ‌గా అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ ఆహ్వానం మేర‌కు ప్ర‌ధాని అమెరికాకు బ‌య‌లుదేరి వెళుతున్నారు.

Also Read : Nara Lokesh : జ‌గ‌న్..ఏపీకి ప‌రిశ్ర‌మలు ఏవీ – లోకేష్

Leave A Reply

Your Email Id will not be published!