Punjab Govt : పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
యూనివర్శిటీలకు చైర్మన్ సీఎం
Punjab Govt : ఆమ్ ఆద్మీ పార్టీ సారథ్యంలోని పంజాబ్ ప్రభుత్వం(Punjab Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. పంజాబ్ రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల చట్టాల సవరణ బిల్లు ను ప్రవేశ పెట్టింది. ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం లభించింది. ఇక నుంచి ముఖ్యమంత్రులు యూనివర్శిటీలకు ఛాన్స్ లర్ గా ఉండాలని కానీ గవర్నర్ కాదన్నారు.
గవర్నర్ పంజాబ్ కు చెందిన వ్యక్తి కాదన్నారు. ఆయనకు రాష్ట్రం గురించి, ఇక్కడి ప్రాంతం గురించి, ప్రజల గురించి, నాగరికత, సంస్కృతి, చరిత్ర గురించి ఏమీ తెలియదన్నారు. ఇక నుంచి వీసీలను నియమించేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. యూనివర్శిటీల సవరణ బిల్లు ప్రవేశ పెట్టిన సందర్బంగా పంజాబ్ శాసనసభలో సీఎం భగవంత్ మాన్ మాట్లాడారు.
కేంద్రం కావాలని గిల్లి కజ్జాలు పెట్టుకోందంటూ మండిపడ్డారు. ఇప్పటికే బీజేపీయేతర ప్రభుత్వాలను , వ్యక్తులను, నేతలను, పార్టీలను , మద్దతుగా నిలిచిన వారిని టార్గెట్ చేస్తోందంటూ ఆవేదన చెందారు. ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకుంటోందని ఆరోపించారు. యూనివర్శిటీలకు గవర్నర్ ఎందుకు చైర్మన్ గా ఉంటారని ప్రశ్నించారు. ఆయనకు ఎలాంటి అధికారాలు కల్పించలేదని స్పష్టం చేశారు సీఎం భగవంత్ మాన్. ఇక నుంచి తానే సుప్రీం అంటూ పేర్కొన్నారు.
గవర్నర్ ల పెత్తనాన్ని, కేంద్రం ఆధిపత్యాన్ని సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు పంజాబ్ సీఎం. ఇందుకు సంబంధించి తాము పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
Also Read : Congress Slams : మణిపూర్ పై సమయం ఇవ్వని మోదీ