CM Siddaramaiah President : ప్రెసిడెంట్ ను కలిసిన సీఎం
సహకారం అందించాలని విన్నపం
CM Siddaramaiah President : కర్ణాటకలో సీఎంగా కొలువు తీరిన సిద్దరామయ్య ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను కలిశారు. రాష్ట్రానికి సహకారం అందించాలని కోరారు. ఇటీవల తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బియ్యాన్నివెంటనే విడుదల చేసేలా చూడాలని విన్నవించారు. ఇందుకు సానుకూలంగా అమిత్ షా స్పందించారని తెలిపారు సిఎం సిద్దరామయ్య. బుధవారం ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
అమిత్ షాను కలుసుకున్న అనంతరం దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును(President Droupadi Murmu) రాష్ట్రపతి భవన్ లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాను అందజేశారు. మర్యాద పూర్వకంగా తాను కలుసుకున్నానని, దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు సీఎం సిద్దరామయ్య.
ఇదిలా ఉండగా కర్ణాటక సీఎం వెంట రాష్ట్ర గృహ నిర్మాణ, వక్ఫ్ , మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ , పట్టణ అభివృద్ది శాఖ మంత్రి బైరతి సురేష్ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎందరో అణగారిన వర్గాలకు చెందిన పేదలు ఉన్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
Also Read : CM Siddaramaiah : బియ్యం పంపిణీపై కేంద్రం వివక్ష