Bhatti Vikramarka : పొంగులేటికి సాదర స్వాగతం – భట్టి
స్పష్టం చేసిన సీఎల్పీ నేత విక్రమార్క
Bhatti Vikramarka : ఖమ్మం జిల్లాలో సీనియర్ నాయకుడైన , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తమ పార్టీలో చేరాల్సిందిగా తాను కోరుతున్నానని స్పష్టం చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ చేపట్టిన భట్టి విక్రమార్క ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి భట్టిని పరామర్శించారు.
ఈ సందర్బంగా గురువారం కేతేపల్లిలో మీడియాతో మాట్లాడారు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). తాను అనారోగ్యానికి గరవడం వల్ల తాను పొంగులేటి వద్దకు వెళ్ల లేక పోయానని తెలిపారు. కానీ వాళ్లు నా వద్దకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాచరిక పాలన సాగుతోందన్నారు. సోనియా గాంధీ దయతో ఇచ్చిన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు.
ఈ సందర్బంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, ఆయన అనుచరులను, నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరానని చెప్పారు. తెలంగాణ సమాజం బాగు పడాలనే ఉద్దేశంతోనే తాము పీపుల్స్ మార్చ్ చేపట్టామని తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కల్వకుంట్ల కుటుంబం అడ్డంగా నిలిచిందన్నారు. కేసీఆర్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా పొంగులేటి పోరాడారని అన్నారు. అది కాంగ్రెస్ పార్టీ ద్వారా సాధ్యమవుతుందన్నారు. అభ్యర్థుల ఎంపిక అనేది సర్వేల ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు.
Also Read : CM KCR : డబుల్ బెడ్రూం ఇళ్లతో ఆత్మ గౌరవం